స్మార్ట్‌ఫోన్ రంగంలో కొత్త టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న HONOR సంస్థ తన తాజా మోడల్ HONOR X80 Pro Maxను అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ సామర్థ్యం, అధిక మన్నిక, ప్రీమియం డిస్‌ప్లే ఫీచర్లతో ఈ డివైస్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ 11,000mAh “Qinghai Lake” బ్యాటరీ. ఇప్పటివరకు కంపెనీ అందించిన అతిపెద్ద బ్యాటరీ ఇదే. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఇతర డివైసులను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.
దీని దీర్ఘకాల బ్యాకప్ కారణంగా లైవ్ స్ట్రీమింగ్ టెస్టుల్లో 26 గంటలకు పైగా పని చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. దృఢత్వం విషయంలో కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. SGS గోల్డ్ లేబల్ 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందిన ఈ డివైస్ 3 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా తయారు చేశారు. అంతేకాకుండా IP68, IP69, IP69K రేటింగ్స్‌తో నీరు, ధూళి, అధిక ఒత్తిడిని కూడా తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంది.
డిస్‌ప్లే పరంగా 6.8 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీతో విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచారు. వివిధ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
పర్ఫార్మెన్స్ కోసం Snapdragon 6 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. Android 16 ఆధారిత MagicOS 10.0పై ఈ డివైస్ పనిచేస్తుంది. దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ స్థిరత్వం కోసం ప్రత్యేక ఆప్టిమైజేషన్లు కూడా అందించారు. కెమెరా విభాగంలో 50MP ప్రధాన రియర్ కెమెరా OIS సపోర్ట్‌తో అందించగా, 8MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు మరియు వీడియో కాల్స్‌కు ఉపయోగపడుతుంది. స్టీరియో స్పీకర్లు, NFC, IR బ్లాస్టర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ధరల విషయానికి వస్తే వివిధ వేరియంట్లలో ఈ ఫోన్ చైనాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. బేస్ మోడల్ ధర సుమారు రూ.27,960 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 26 నుంచి అధికారికంగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.








