Haryana bank scam: హర్యానాలో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే IDFC First Bank లో రూ.590 కోట్ల స్కాం చర్చల్లో ఉండగానే, ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్(Kotak Mahindra Bank) లో రూ.160 కోట్ల ఎఫ్‌డీ మోసం బయటపడింది.
పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చూపించిన ఈ నిధులు అసలు బ్యాంక్‌లో జమ కాలేదని విచారణలో తేలింది. నకిలీ డాక్యుమెంట్లతో డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ కుంభకోణం బయటపడటానికి కారణం ఒక ఎఫ్‌డీ గడువు ముగిసిన తర్వాత డబ్బు బదిలీ కోరడమే. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫర్ చూపించినా, వాస్తవంగా నిధులు ఖాతాకు చేరలేదు. దీంతో లోతుగా పరిశీలించగా స్టేట్‌మెంట్ కూడా నకిలీదేనని బయటపడింది.
ఈ వ్యవహారంలో బ్యాంక్ సిబ్బందితో పాటు మున్సిపల్ అధికారులు కూడా ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పంచకుల మున్సిపల్ కమిషనర్ వినయ్ కుమార్ ఈ ఘటనపై స్టేట్ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వ పనుల నుంచి తొలగించాలని కోరారు.
హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు దేశ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి.








