Thursday, April 16, 2026
Chat on WhatsApp
HomeBusinessGold and Silver Prices | దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పూర్తి వివరాలు

Gold and Silver Prices | దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పూర్తి వివరాలు

-

Chat on WhatsApp

Gold and Silver Prices: బంగారం ధరలు ఈ వారం వరుసగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పసిడి రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగినప్పటికీ, ధరలు పెరగడం కొనుగోలుదారులకు భారంగా మారింది.

గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,570గా నమోదైంది. బుధవారం ఇది రూ.1,55,350గా ఉండగా ఒక్క రోజులో రూ.220 పెరుగుదల కనిపించింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,600గా నమోదైంది, ఇది బుధవారం రూ.1,42,400గా ఉండగా రూ.200 పెరిగింది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,230గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,210గా నమోదైంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,55,570గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,600గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,720కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,750గా నమోదైంది.

వెండి ధరలు కూడా పెరుగుదల దిశలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,70,100గా ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,75,100గా కొనసాగుతోంది. చెన్నైలో కూడా ఇదే స్థాయిలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

ప్రపంచ మార్కెట్ల ప్రభావం, డిమాండ్ పెరుగుదల కారణంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

heatwave conditions in telangana with high temperatures and orange alert warning

Telangana Heat Wave | తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

Telangana Heat Wave: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది. వచ్చే మూడు రోజుల...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102