సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు బాది మ్యాచ్ దిశను మార్చేశాడు. ధోనీ విజృంభణతో సీఎస్‌కే సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేయగా, వరుస పరాజయాలకు ముగింపు పలికింది.
మ్యాచ్ అనంతరం సీఎస్‌కే జట్టు లక్నోలోని తమ బస హోటల్‌కు తిరిగి వెళ్లింది. జట్టు సభ్యులకు అభిమానుల నుంచి ఉత్సాహభరిత స్వాగతం లభించింది. అయితే అందరిలోను ధోనీ మాత్రం కాస్త బాధలో కనిపించాడు. హోటల్ లాబీలో నడిచే సమయంలో ఆయన కుంటుతూ ముందుకు సాగాడు. ఈ దృశ్యాలు కెమెరాల్లో బంధించబడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ధోనీ నడవడంలో అసౌకర్యాన్ని గమనించిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో మోకాలిపై శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే గాయం మళ్లీ బాధించుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాహీ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేస్తున్నారు.
ధోనీ వయసు పెరిగినా, గాయాల మధ్యలోనూ గట్టిగా పోరాడుతూ జట్టుకు విజయాలు అందిస్తుండటం అతడి గొప్పతనాన్ని చాటుతుంది. అయినప్పటికీ, ఇటువంటి గాయాలు ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లపై ప్రభావం చూపే అవకాశముంది. సీఎస్‌కే ఫ్యాన్స్ మాత్రం ధోనీ పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మైదానంలో అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నారు.