Friday, July 17, 2026
Chat on WhatsApp
HomeBusinessGold and Silver Prices | బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి తాజా ధరలు ఇవే!

Gold and Silver Prices | బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి తాజా ధరలు ఇవే!

-

Chat on WhatsApp

Gold and Silver Prices: కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, భౌగోళిక అనిశ్చితి, డాలర్ మారకం విలువలో మార్పులు, బులియన్ మార్కెట్ ధోరణుల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. జూలై 17 ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,43,280కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి రూ.1,31,340గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.2,34,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,280, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,340గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,39,900గా నమోదైంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,430, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,490, వెండి రూ.2,34,900గా ఉంది. ముంబై, బెంగళూరులో బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉండగా, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,450, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,490గా నమోదైంది. స్థానిక డిమాండ్, సరఫరా, రవాణా ఖర్చులు, రాష్ట్ర పన్నులు, దిగుమతి సుంకాలు వంటి కారణాల వల్ల నగరాలవారీగా ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indus Waters Treaty arbitration dispute between India and Pakistan

Indus Waters Treaty | భారత్ ఇచ్చిన షాక్‌కు పాక్ విలవిల, సింధు వివాదం.. భారత్...

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వివాదంలో పాకిస్థాన్‌కు ఆర్థిక భారం పెరుగుతోంది. భారత్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండటంతో, విచారణ నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp