First Day Collections: దర్శకుడు అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన “మన శంకర వరప్రసాద్”(mana shankara varaprasad) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.
జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో మరోసారి తన బాస్ రేంజ్‌ను చాటుకున్నారు.
ALSO READ:Team India vs New Zealand:టీమిండియా మ్యాచ్‌లో భాషా వివాదం.. ‘జాతీయ భాష’ వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం
వింటేజ్ లుక్‌లో చిరంజీవి కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన యాక్టింగ్, డ్యాన్సులు, అనిల్ రావిపూడి(Anil Ravipudi) మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
బాక్సాఫీస్ పరంగా కూడా ఈ సినిమా అదిరిపోయే ఆరంభాన్ని సాధించింది. ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు కలెక్షన్లను కలుపుకొని, ప్రపంచవ్యాప్తంగా “Mana Shankara Varaprasad” సినిమా రూ.84 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది.
వెంకీ క్యామియో పాత్ర, నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, పాటలు, కామెడీ సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేనా, రఘుబాబు, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
