మహిళలు చైతన్యవంతులైతే ఆ ప్రాంతం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు.
పెద్దబండపల్లి లో జరిగిన సక్షం అంగన్వాడి కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు రేపటి భావి పౌరులని చెప్పారు.
పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా ఎదగాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారం అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
గత వైకాపా పాలనలో కోడిగుడ్లు, పాలు పాడైనవి అందించేవారని, ప్రస్తుతం సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు.
పిల్లల మంచి ఆరోగ్యం, మనోవికాసం కోసం స్వచ్ఛమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటోందని అన్నారు.
పెద్దబండపల్లి గ్రామానికి కళ్యాణ మండపం, వెంకటేశ్వర ఆలయం నిర్మాణం కోసం తన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని వివరించారు.
రాష్ట్రంలోనే పెద్దబండపల్లిని ఆదర్శ గ్రామంగా మార్చాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.
ఐసిడిఎస్ అధికారులు, టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించారని ఎమ్మెల్యే తెలిపారు.