LIVE
Monday, November 2, 2026
LIVE
LIVE

Delhi Traders Loss | ర్యాలీ దెబ్బకు మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు.. వ్యాపారుల ఆవేదన

by Bajaswamy
7 views
Closed shops in Delhi markets following the INDIA bloc rally at Ramlila Maidan.

Delhi Traders Loss: రాజకీయ కార్యక్రమాలు ఒక్కోసారి సామాన్యుల జీవనోపాధిపై కూడా ప్రభావం చూపుతుంటాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీపై వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమం కారణంగా తమకు ఏకంగా రూ.11 వేల కోట్ల వ్యాపార నష్టం వాటిల్లిందని ఢిల్లీ వ్యాపార సంఘాలు ఆరోపించాయి. రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ ర్యాలీ పండుగల సీజన్‌లో నిర్వహించడంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడిందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది. సంస్థ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రిటైల్, హోల్‌సేల్ రంగాలకు రూ.8,800 కోట్లు, రవాణా, లాజిస్టిక్స్ విభాగాలకు రూ.1,500 కోట్లు, హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలకు రూ.500 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

ర్యాలీ జరిగిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రధాన మార్కెట్లలో వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయని వ్యాపార సంఘాలు తెలిపాయి. చాందినీ చౌక్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సదర్ బజార్ వంటి ప్రాంతాల్లో దాదాపు 2.5 లక్షల దుకాణాలు మూతపడినట్లు పేర్కొన్నాయి. దీంతో సుమారు 20 లక్షల మంది కార్మికులు, వీధి వ్యాపారుల ఉపాధిపై ప్రభావం పడిందని, ఈ వర్గాలకు దాదాపు రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించాయి. మరోవైపు ఈ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దుకాణాలను బీజేపీ ప్రభుత్వమే బలవంతంగా మూసివేయించిందని ఆయన ఆరోపించారు. ర్యాలీకి వచ్చిన ప్రజలు స్థానిక వ్యాపారులకు అండగా నిలుస్తూ షాపింగ్ చేయాలని తాము కోరామని, కానీ ప్రభుత్వ చర్యల వల్ల దుకాణాలు మూతపడ్డాయని ఓ వీడియో ద్వారా విమర్శించారు. మొత్తంగా ఢిల్లీ ర్యాలీ ఇప్పుడు రాజకీయ విమర్శలకే కాకుండా వ్యాపార నష్టాల అంశంతోనూ చర్చనీయాంశంగా మారింది. వ్యాపార సంఘాల ఆరోపణలు, కాంగ్రెస్ నేతల ప్రత్యారోపణల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More