Cable Channels Protest: హైదరాబాద్‌లో కేబుల్ ఛానళ్ల జర్నలిస్టుల సమస్యలు మరోసారి ఆందోళనకు దారితీశాయి. కేబుల్ ఛానళ్ల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. మాసాబ్ ట్యాంక్‌లోని సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) కార్యాలయాన్ని ముట్టడించారు. కేబుల్ ఛానళ్లలో పనిచేస్తూ అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మొండి వైఖరిని వీడి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని నిరసనకారులు స్పష్టం చేశారు.
Cable Channels Protest | హైదరాబాద్‌లో కేబుల్ ఛానళ్ల మహా నిరసన.. I&PR కార్యాలయం ముట్టడి
12
