Amitabh Bachchan: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత జీవితంలోని ఓ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. భార్య జయ బచ్చన్‌తో వివాహమైన తొలినాళ్లలో జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకుంటూ నవ్వులు పూయించారు. ప్రముఖ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వేదికగా నటుడు రణ్‌బీర్ కపూర్‌తో జరిగిన సంభాషణలో ఈ ఆసక్తికర విషయం వెల్లడించారు. పెళ్లయిన కొత్తలో జయ బచ్చన్ తనను ఎంతో ఆప్యాయంగా ‘లంబు జీ’ అని పిలిచేవారని అమితాబ్ తెలిపారు. అయితే ఈ పిలుపుపై తన తండ్రి, రచయిత హరివంశరాయ్ బచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేశారట. జయతో మాట్లాడుతూ.. అలా కాకుండా తన పేరుతో లేదా మరో మంచి పదంతో పిలవాలని సూచించారని అమితాబ్ గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి జయ తనను పేరుతో పిలవడం ప్రారంభించారని సరదాగా వివరించారు.
ఈ చర్చలో రణ్‌బీర్ కపూర్ కూడా తన భార్య అలియా భట్‌తో ఉన్న ఎత్తు వ్యత్యాసం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమితాబ్‌లా పొడవుగా, అలియా జయ బచ్చన్‌లా తక్కువ ఎత్తులో ఉంటే తమ జంట ఫొటోల్లో మరింత అందంగా కనిపించేదని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. తన ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు కాగా, జయ ఎత్తు సుమారు 5 అడుగుల 3 లేదా 4 అంగుళాలు ఉంటుందని చెప్పారు. వెంటనే రణ్‌బీర్ తమ జంట మధ్య కూడా దాదాపు ఇలాంటి ఎత్తు వ్యత్యాసమే ఉందని చమత్కరించారు. ఇలా పాత జ్ఞాపకాలు, కుటుంబ విషయాలు, సరదా వ్యాఖ్యలతో సాగిన ఈ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమితాబ్ చెప్పిన ఈ ఆసక్తికర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ: Delhi Traders Loss | ర్యాలీ దెబ్బకు మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు.. వ్యాపారుల ఆవేదన
