Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగం పెంచుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 మునిసిపాలిటీలను కలిపే ప్రతిపాదన తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ:Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన
గ్రామీణ ఓటు బ్యాంకు లక్ష్యంగా ఇందిరమ్మ చీరల పంపిణీని వేగంగా పూర్తి చేయడం, గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన నాణ్యతను అందించామని ప్రచారం చేయడం మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా కనిపిస్తోంది. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ను పార్టీ బలంగా ఉపయోగిస్తోంది.
పెట్టుబడులు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, ఉపాధి అవకాశాల పెరుగుదల వంటి అంశాలను గ్రామస్థాయిలో ప్రచారంలో భాగం చేస్తున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రాయితీలు వంటి పథకాలు కూడా ఓటర్లను ఆకట్టుకునే అంశాలుగా నిలుస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగకపోయినా స్థానిక మద్దతుదారుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఇది కాంగ్రెస్కు అనుకూలంగా మారవచ్చని అంచనా. అయితే రిజర్వేషన్ వ్యవహారం పార్టీకి సవాలుగా మారే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
