Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaJangaonజనగామ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ ప్రారంభం

జనగామ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ ప్రారంభం

-

Chat on WhatsApp

జనగామ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను చేపట్టిందన్నారు. ఈ సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటింటి జాబితా రూపొందిస్తున్నామన్నారు. ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, 18వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఈ సర్వేకు నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, పర్యవేక్షణ అధికారిగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ లు వ్యవహరిస్తారన్నారు. ఈ సర్వే పట్ల జిల్లా యంత్రాంగం ఎంతగానో శ్రమిస్తోందన్నారు. ఈ సర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, అందుకోసం మూడంచెల పర్యవేక్షణ టీమ్ లను నియమించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp