Drone Taxi Project AP | డ్రోన్ సిటీ–స్పేస్ సిటీ శంకుస్థాపన 

Chandrababu Naidu launching Drone City and announcing drone taxi development in Andhra Pradesh Chandrababu Naidu launching Drone City and announcing drone taxi development in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా(Green Hydrogen Valley) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా రాష్ట్రంలోనే తొలిసారిగా”డ్రోన్ ట్యాక్సీల(Drone Taxi Project AP) అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేశారు”.

శుక్రవారం డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టుల శంకుస్థాపనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా నిర్వహించారు.

ALSO READ:Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆధునిక రవాణా వ్యవస్థల అభివృద్ధి రాష్ట్రానికి కొత్త అవకాశాలు తెస్తాయన్నారు. డ్రోన్ ట్యాక్సీలు ప్రవేశపెట్టి పట్టణ రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్లడించారు.

డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం సాంకేతిక మరియు మౌలిక సదుపాయాల పరంగా సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే డ్రోన్ ఆధారిత సేవలు వాస్తవ రూపంలోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *