Viral Video: ఆపద ఎదురైనప్పుడు తెలివిగా వ్యవహరిస్తే దారి దొరుకుతుందనడానికి ఈ కుక్క చేసిన పని ఉదాహరణగా నిలుస్తోంది. చుట్టూ వీధి కుక్కలు చేరడంతో చిక్కుల్లో పడిన ఓ కుక్క, వాటి నుంచి తప్పించుకునేందుకు ఊహించని ఎత్తుగడ వేసింది. అకస్మాత్తుగా అనారోగ్యంతో పడిపోయినట్టుగా నేలపై కదలకుండా ఉండిపోయింది. చుట్టూ ఉన్న కుక్కలు దగ్గరకు వచ్చినా ఎలాంటి కదలిక లేకుండా అలాగే ఉండిపోయింది. దీంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పరిస్థితి అనుకూలించిందని గుర్తించిన వెంటనే లేచి వేగంగా అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ కుక్క ప్రదర్శించిన చాకచక్యాన్ని చూసి నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. దాని నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, ఈ చిన్న వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది!
చుట్టూ వీధి కుక్కల గ్యాంగ్… తప్పించుకునేందుకు ఓ కుక్క వేసిన ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్!
రోగం వచ్చినట్టు నేలపై పడుకుని కదలకుండా యాక్టింగ్ చేసింది. దగ్గరకు వచ్చినా కదల్లేదు. అవన్నీ వెళ్లిపోయాయని నిర్ధారించుకున్న వెంటనే ఒక్కసారిగా లేచి పరుగు పెట్టింది!