చిన్న శంకరంపేటలో చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు ఉచిత తాగునీరు

A drinking water stall was set up in Chinna Shankarampet to help locals, initiated by Kanjarl Chandra Shekar with Dr. Sridhar’s support.

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాధిక డయాగ్నostic సెంటర్ డాక్టర్ శ్రీధర్ సహకారంతో గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి, ఉచిత తాగునీరు అందుబాటులో ఉంచిన నిర్వాహకులను అభినందించారు.

చలివేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు నలుమూలల నుంచి ప్రజలు రావడం జరుగుతుందని తెలిపారు. అలాగే, మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఎండల తీవ్రత తగ్గే వరకు ఈ సేవను కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు.

ఉచిత తాగునీరు అందించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత పెరిగేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కంజర్ల చంద్రశేఖర్, నరేష్ గౌడ్, నిద్రబోయిన స్వామి, కుమ్మరి లింగం, ఉడుత శ్రీమన్, తుపాకుల శ్రీనివాస్, బొమ్మెర బోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *