గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరం గుమ్మలక్ష్మీపురం మండలంలోని గిరిశిఖర ప్రాంతమైన నెల్లి కిక్కవ పంచాయితీ వాడపుట్టి, దుడ్డుకల్లు పంచాయితీ కొత్తవలస గ్రామాల్లో ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరంలో మొత్తం 184 మందికి కంటి తనిఖీలు నిర్వహించారు. వీరిలో 43 మందిని శస్త్ర చికిత్స కోసం విజయనగరం పంపించారు. వీరికి శస్త్ర చికిత్స పూర్తయ్యాక,…
