ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర కృషి
పార్వతీపురం అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర పని చేస్తున్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించగా, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. పట్టణంతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర తటస్థంగా విన్నారు. విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు, ప్రభుత్వ సేవలపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను…
