గడ్డపోతారం గ్రామంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం టార్గెట్
సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎం(ATM) చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. జిన్నారం మండలం గడ్డపోతారం(Gaddapotharam ) గ్రామంలో ఉన్న గుర్తుతెలియని దొంగలు ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలోకి చొరబడి దాదాపు రూ.1.60 లక్షల నగదును అపహరించినట్లు సమాచారం.
గ్రామంలో ఉన్న పోచమ్మ ఆలయం పక్కన ఉన్న Kotak Mahindra Bank కు చెందిన ఏటీఎంలో ఈ చోరీ ఘటన జరిగినట్లు సమాచారం. దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున ఏటీఎం పగలగొట్టబడినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Sangareddy ATM theft | సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎం చోరీ…నగదు అపహరణ
RELATED ARTICLES








