తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య–సాక్షిల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులోని ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు చిరంజీవి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నటుడు బ్రహ్మానందం, టీ. సుబ్బరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ అజరుద్దీన్, పొంగులేటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులపై ఆశీర్వచనాలు కురిపించారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల హాజరుతో వేడుక మరింత జంటగా సాగింది.
ALSO READ:బీచుపల్లి కృష్ణానదిలో దూకిన వ్యక్తిని రక్షించిన గజ ఈతగాళ్లు
