బీచుపల్లి కృష్ణానదిలో దూకిన వ్యక్తిని రక్షించిన గజ ఈతగాళ్లు

Professional swimmers rescuing a man who jumped into the Krishna River at Beechupally Professional swimmers rescuing a man who jumped into the Krishna River at Beechupally

జోగులాంబ గద్వాల జిల్లా ఎడవల్లి మండలం బీచుపల్లి కృష్ణానదిలో జరిగిన ఆత్మ*హ*త్య ప్రయత్నం సకాలంలో తప్పింది. కర్నూలుకు చెందిన సూర్య అయ్యప్ప స్వామి, కృష్ణా బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకగా, అక్కడే విధి నిర్వహణలో ఉన్న గజ ఈతగాళ్లు ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే చర్యలకు దిగారు. బోటు సహాయంతో వేగంగా చేరుకున్న వారు అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చి ప్రాణాలను రక్షించారు.

ALSO READ:India vs South Africa | సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాజయం – దక్షిణాఫ్రికా వైట్‌వాష్
రక్షణ అనంతరం అతన్ని స్థానిక ఇటిక్యాల ఎస్‌ఐ రవికుమార్‌కు అప్పగించారు. ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తంగా, వేగంగా స్పందించి విలువైన ప్రాణాన్ని కాపాడిన గజ ఈతగాళ్లు తెలుగు నరసింహులు, చిన్న నరసింహులు, శేషన్న, దశరథం, పుల్లన్నలను అధికారులు, స్థానికులు అభినందించారు.

బీచుపల్లి ప్రాంతంలో ఇలాంటి ఘటనలను నివారించడంలో గజ ఈతగాళ్ల చర్య మరింత ప్రశంసలు పొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *