AP Cyclone Alert | అండమాన్‌లో అల్పపీడనం….24న వాయుగుండం

Andaman low-pressure system likely to intensify into a cyclone over Bay of Bengal Andaman low-pressure system likely to intensify into a cyclone over Bay of Bengal

విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం(Andaman Low Pressure) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఇది ఈ నెల 24వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.

అనంతరం మరింతగా శక్తి సంతరించుకుని, వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ALSO READ:మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ…37 మంది మావోయిస్టుల లొంగుబాటు


ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఇవాళ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు, గాలివానలు నమోదు అయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *