*మందులపై డిస్కౌంట్ల పేరుతో ప్రజలను చీటింగ్ చేస్తున్న పవన్ మెడికల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి
*పవన్ మెడికల్స్ ధన దాహానికి బలైన జర్నలిస్ట్ నాగేశ్వరరావు
*వేరే బ్రాండ్లు మింగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి విరోచనాలతో అస్వస్థతకు గురి అయిన జర్నలిస్ట్ నాగేశ్వరరావు
*పవన్ మెడికల్స్ పై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన జర్నలిస్ట్ నాగేశ్వరరావు
నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న పవన్ మెడికల్స్ ప్రజలను డిస్కౌంట్ ల పేరుతో ఆకర్షిస్తూ, వారి నుంచి అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో జర్నలిస్ట్ నాగేశ్వరరావు నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ను పవన్ మెడికల్స్ కి తీసుకెళ్లగా వారు జనరిక్ మందులు అందించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. మందులు చీటీలో ఉన్న బ్రాండెడ్లు కాకుండా జెనీరిక్ మందుల అందించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అవే మందులు బయట జనరిక్ షాప్ లో షీట్ 350 రూపాయలు కాగా నాగేశ్వరరావు దగ్గర 1100 వసూలు చేశారు. వేరే బ్రాండ్ల మందులు మింగడం వల్ల నాగేశ్వరరావు తీవ్ర కడుపునొప్పి, విరోచనాలతో అస్వస్థకు గురైనట్లు తెలియజేశారు. పవన్ మెడికల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి, డీఎంహెచ్ఓ ఆఫీసర్ కి, ఎస్పీ గారికి, డ్రగ్ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం ఇచ్చినట్లు సదరు రోగి తన ఆవేదన వ్యక్తం చేశారు.