కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాళ్ళ గ్రామంలో కూటమి ప్రభుత్వం పల్లె పండగ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గ్రామానికి రావడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు చేస్తూ ఉంటామని తెలిపారు.
గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లే సమస్య తెలుసుకొని అలాగే రోడ్లు డ్రైనేజీలు ఇంకా చాలానే ఉన్నాయని అలాగే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ మరి ఎంపిటిసి గ్రామ పెద్దమనిషి నారాయణప్ప అందరూ కలిసి గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే కే వివరించారు. అలాగే గత ప్రభుత్వంలో ఎలాంటి గ్రామంలో అభివృద్ధి లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సిసి రోడ్డు, డ్రైనేజీ కోసం గ్రామంలో 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ల కోసం, గ్రామ అభివృద్ధి కోసం తెచ్చావని, అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ అభివృద్ధి చేస్తామని, అక్కడక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తామని, అలాగే పొలానికి వెళ్లే రాస్తా కూడా బాగా చేపిస్తామని, అలాగే ప్రధానంగా మంచి నీటి సమస్య తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం ఆశా వర్కర్ గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ ఇంచార్జ్ ఎన్ మల్లప్ప మరియు మానవి దేవేంద్రప్ప ఉమ్ము సలీం బిజెపి నాయకులు కనిగిరి నీలకంఠప్ప గ్రామంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హనవాళ్ళ గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం
