జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నదిలో మక్తల్ మొత్తం పట్టణం దుండి గ్రామానికి చెందిన 16 ఏళ్ల వయసు ఉన్న బాలుడు వారి బంధువులతో పాటు బీచుపల్లి రామాలయంలో పుట్టు వెంట్రుకలు ఫంక్షన్కు వచ్చిన బాలుడు కృష్ణా నదిలో స్నానమాచరిస్తుండగా లోతు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయి నీటిలో మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు ప్రజలు కేకలు వేయడంతో తక్షణమే అక్కడ ఉన్న ముదిరాజ్ గజితగాళ్లు వెంటనే నదిలోకి వెళ్లి ఆ కుర్రవాణి నీటిలో నుండి బయటకు తీసుకురావడం జరిగింది అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుని ప్రాథమిక చికిత్స చేసి వెంటనే వాళ్ళ బంధువులకు అప్పగించి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి బాలుడు కోలుకున్నాడని సమాచారం చెప్పారు ఈ కార్యక్రమంలో గజతగాళ్లు తెలుగుశాంతన్న,తెలుగు వెంకటేష్, పర్ష, చిన్న మద్దిలేటి, నర్సింములు, తదితరులు వెళ్లి కాపాడడం జరిగింది.
కృష్ణా నదిలో మునిగిన బాలుడిని గజతగాళ్లు కాపాడారు
