హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ ముఠా పట్టివేతలో ఎస్‌ఓటీ అపరేషన్

మీర్పేట్, ఆదిబట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మీర్పేట్, ఆదిబట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ఎల్‌బి నగర్ ఎస్‌ఓటీ, మీర్పేట్, ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

మీర్పేట్ పరిధిలో ఐదుగురు నిందితులు హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

హ్యాష్ ఆయిల్ సరఫరాలో ప్రధాన నిందితుడు రంజిత్ కుమార్ అని గుర్తించారు. వైజాగ్ నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు.

రంజిత్ కుమార్ గతంలో ఎక్సైజ్ పోలీసుల చేత అరెస్ట్ అయ్యాడని, ఇది అతని మూడో నేరం అని అధికారులు తెలిపారు. హ్యాష్ ఆయిల్ విలువ రూ. 21 లక్షలు ఉంటుంది.

రెండవ కేసులో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరిని ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ కుమార్, బీరేందర్ సింగ్ ప్రధాన నిందితులు.

నిందితులు బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నారు. గంజాయి చాక్లెట్ గుర్తించడం కష్టం కావడంతో తేలికగా విక్రయిస్తున్నారు.

సంతోష్ కుమార్ కేబుల్ వైర్ ఇన్‌స్టాలేషన్ చేస్తూ, ఈజీ మనీ కోసం గంజాయి చాక్లెట్లను విక్రయించడం మొదలుపెట్టాడని పోలీసులు వెల్లడించారు.

మొత్తం 3.8 కేజీల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశామని, నిందితులపై మరిన్ని విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *