Monday, August 3, 2026
Chat on WhatsApp
HomeTechnology Newsరూ.23,999కే Samsung కొత్త 5G ఫోన్.. 6000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి!

రూ.23,999కే Samsung కొత్త 5G ఫోన్.. 6000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి!

-

Chat on WhatsApp

భారత మార్కెట్లో Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్‌ఫోన్ అధికారికంగా విడుదలైంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఆరా గ్రీన్, ఆల్ఫా బ్లాక్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ఆగస్టు 8 నుంచి Flipkart Freedom Sale మరియు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో విడుదలైంది. 6GB+128GB రూ.23,999, 8GB+128GB రూ.27,999, 8GB+256GB రూ.32,999 ధరలకు అందుబాటులో ఉంటుంది.

Flipkart Axis Bank, Flipkart SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1,200 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Galaxy F70 Pro 5Gలో 6.7 అంగుళాల FHD+ Super AMOLED 120Hz డిస్‌ప్లే, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM, Android 16 ఆధారిత One UI 8.5 ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం 50MP OIS ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాలు, 12MP సెల్ఫీ కెమెరా అందించారు. భారీ 6000mAh బ్యాటరీ, 45W వేగవంతమైన ఛార్జింగ్, Samsung Knox సెక్యూరిటీ, 4K వీడియో రికార్డింగ్, AI ఆధారిత కెమెరా ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌కు అదనపు బలంగా ఉన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Mythri Movie Makers Announces Donga Naa Koduku Robbery Comedy Film

Mythri Movie Makers |’దొంగ నా కొడుకు’తో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ప్రయోగం.....

Mythri Movie Makers: టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్త నటీనటులు, యువ సాంకేతిక నిపుణులతో వినూత్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది....
- Advertisement -
Chat on WhatsApp