Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTDhanush | అవార్డులు కాదు.. ప్రేక్షకుల ప్రేమే ముఖ్యం: ధనుష్ కామెంట్స్ వైరల్

Dhanush | అవార్డులు కాదు.. ప్రేక్షకుల ప్రేమే ముఖ్యం: ధనుష్ కామెంట్స్ వైరల్

-

Chat on WhatsApp

Dhanush: ఉత్తమ తమిళ చిత్రంగా ‘రాయన్'(Raayan)కు జాతీయ అవార్డు రావడం.. ‘మెయ్యళగన్’, ‘మహారాజా’కు నిరాశ ఎదురుకావడం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్చల మధ్య మౌనం వీడిన ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రాయన్’కు అవార్డు రావడాన్ని ప్రశ్నిస్తున్న వారిని తప్పుపట్టలేమని, అదే సమయంలో ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ కూడా జాతీయ అవార్డుకు అర్హమైన చిత్రాలేనని ఆయన అన్నారు.

ఒకే ఏడాదిలో ఎన్నో మంచి సినిమాలు విడుదలైతే ఇలాంటి భిన్నాభిప్రాయాలు సహజమేనని పేర్కొన్నారు. తన సినీ ప్రయాణాన్ని ప్రస్తావించిన ధనుష్, ‘పుదుపేట్టై’, ‘మర్యాన్’, ‘కర్ణన్’, ‘రాంఝానా’, ‘వడ చెన్నై’ వంటి తన కెరీర్‌లో గుర్తింపు పొందిన సినిమాలకు జాతీయ అవార్డులు రాలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ వాటి విలువ ఏమాత్రం తగ్గలేదన్నారు. ఒక చిత్రం ఎంత గొప్పదో అవార్డులు కాదు.. ప్రేక్షకుల హృదయాల్లో ఎంతకాలం నిలిచిపోతుందన్నదే అసలైన విజయమని వ్యాఖ్యానించారు.

“మీ ఓటమిని మీరు అంగీకరించనంత వరకు మీరు ఓడిపోలేదు” అనే అజిత్ కుమార్ సందేశాన్ని తాను ఎప్పుడూ నమ్ముతానని ధనుష్ పేర్కొన్నారు. అవార్డులపై విభేదాల కంటే తమిళ సినిమా విజయాలను కలిసి జరుపుకోవడం, మంచి చిత్రాలను ప్రోత్సహించడం, కళాకారుల కృషిని గౌరవించడం ముఖ్యమని ధనుష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp