WhatsApp: వాట్సాప్ వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు మెటా పలు కొత్త ఫీచర్లను విడుదల చేసింది. వీటిలో యాప్‌లోనే PDF ఫైళ్లను ఎడిట్ చేసే సదుపాయం, ఐప్యాడ్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగించే అవకాశం, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల నుంచి పాటలను నేరుగా స్టేటస్‌లో షేర్ చేసే ఫీచర్ ప్రధానంగా ఉన్నాయి. ఇప్పటివరకు PDFలను సవరించాలంటే వేరే యాప్‌ల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అడోబ్‌తో భాగస్వామ్యం ద్వారా వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్‌లలోనే డాక్యుమెంట్లను సులభంగా ఎడిట్ చేయవచ్చు.
ఐప్యాడ్ వినియోగదారులకు కూడా కీలక మార్పు తీసుకొచ్చిన మెటా, ఇకపై స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడకుండా ఐప్యాడ్‌లోనే కొత్త వాట్సాప్ అకౌంట్ సృష్టించి, నేరుగా లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై వంటి ప్లాట్‌ఫామ్‌లలో వినిపిస్తున్న పాటలను నేరుగా వాట్సాప్ స్టేటస్‌గా షేర్ చేసుకునే వీలును కూడా అందించింది. అలాగే కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులు ఇకపై కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ నుంచే వాట్సాప్ మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం, కాల్ హిస్టరీ చూడడం వంటి పనులు చేయగలరు. ఈ ఫీచర్లను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా వెల్లడించింది.
ALSO READ: KTR | వేడుకల కంటే విద్యార్థుల పోరాటమే ముఖ్యం: కేటీఆర్








