నటసింహం నందమూరి బాలకృష్ణకు NBK111 షూటింగ్ సమయంలో స్వల్ప గాయం అయినట్లు సమాచారం. కాకినాడ షూటింగ్ లొకేషన్లో యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తుండగా బాలయ్యకు స్వల్ప అసౌకర్యం ఏర్పడిందని, వైద్య పరీక్షల్లో మసిల్ టియర్‌గా నిర్ధారణ అయినట్లు గోపీచంద్ మలినేని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు త్వరగా కోలుకునేందుకు చిన్నపాటి మైనర్ సర్జరీ అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాలకృష్ణ త్వరలోనే కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొంటారని చిత్ర బృందం తెలిపింది. బాలయ్య బాబు క్రమశిక్షణ, సినిమా పట్ల అంకితభావం ఎప్పుడూ ఆదర్శంగా ఉంటాయని దర్శకుడు గోపీచంద్ మలినేని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ షూటింగ్‌పై ఆయన చూపించే నిబద్ధత చిత్ర బృందానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ALSO READ: JP Nadda | నీట్ వివాదంలో కీలక పరిణామం.. గాయపడిన వారిని పరామర్శించిన జేపీ నడ్డా








