Balkampet Renuka Ellamma: ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. అమ్మవారిని గజమాలలు, వివిధ రకాల రంగురంగుల పూలతో పాటు స్వర్ణాభరణాలు, ప్రత్యేకంగా సిద్ధం చేసిన డ్రై ఫ్రూట్స్ దండలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు.
ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం తెలంగాణ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
ALSP READ: Kiren Rijiju | NEET స్కామ్పై కేంద్రం కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు








