Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeNationalRaghava Lawrence | రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ.. త్రిష కు రూట్ క్లియర్ అయినట్లేనా...

Raghava Lawrence | రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ.. త్రిష కు రూట్ క్లియర్ అయినట్లేనా ?

-

Chat on WhatsApp

Raghava Lawrence: రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం మధ్య రాఘవ లారెన్స్ స్పందిస్తూ తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై స్పష్టత ఇచ్చారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న మాట నిజమేనని పేర్కొన్నప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని వెల్లడించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం అంటే పదవి కోసం తొందరపడటం కాదన్నారు. ఎమ్మెల్యే లేదా మంత్రి కావాలనే ఉద్దేశంతో హడావుడిగా నిర్ణయాలు తీసుకోనని చెప్పారు.

ఏ రాజకీయ పార్టీతో ప్రయాణం చేయాలన్నా అది విలువలు, పరస్పర గౌరవం ఆధారంగానే ఉండాలని, రాజకీయాలను వ్యాపారంలా చూడలేమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలపైనే ఉందని, ప్రజలకు ఉపయోగపడే పనులే తనకు ముఖ్యమని తెలిపారు. “నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి.. ప్రతిఫలం గురించి ఆలోచించవద్దు” అనే సందేశంతో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోను విడుదల చేశారు. గతంలో తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వచ్చిన వివాదాలను కూడా ప్రస్తావిస్తూ, ప్రజలను ఉద్దేశించి తాను అవమానకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అయితే అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు, ఈ స్థానం నుంచి తమిళగ వెట్రి కళగం (TVK) తరఫున నటి త్రిష(Trisha)ను బరిలోకి దింపే అవకాశాలపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

general dhiraj seth takes charge as indian army chief of staff

General Dhiraj Seth | భారత సైన్యానికి కొత్త నాయకత్వం.. ఆర్మీ చీఫ్‌గా ధీరజ్...

General Dhiraj Seth: భారత సైన్యానికి కొత్త అధిపతి నియమితులయ్యారు. జనరల్ ధీరజ్ సేథ్ ఈరోజు అధికారికంగా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (COAS)గా బాధ్యతలను స్వీకరించారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో జరిగిన...
- Advertisement -
Chat on WhatsApp