Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshDance Master Pandu | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. గాయపడిన డాన్స్ మాస్టర్ పండు

Dance Master Pandu | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. గాయపడిన డాన్స్ మాస్టర్ పండు

-

Chat on WhatsApp

Dance Master Pandu: విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. డాన్స్ కార్యక్రమం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, పండు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై కొంతసేపు పక్కకు ఆపి నిలిపారు.

ఆ సమయంలో వాహనం పక్కనే నిలబడి ఉన్న పండును వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండుకు తీవ్ర గాయాలు కాగా, ఆయనతో పాటు ఉన్న మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం పండు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బొలెరో వాహనం వేగమే ప్రమాదానికి కారణమా లేదా ఇతర అంశాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp