Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeNationalCM Vijay | సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న సీఎం విజయ్.. వైరల్ వీడియో

CM Vijay | సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న సీఎం విజయ్.. వైరల్ వీడియో

-

Chat on WhatsApp

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో  ట్రెడిషనల్ లూక్స్లో తన మేనేజర్ జగదీష్ పళనిసామి ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. తరచుగా నల్ల బ్లేజర్, తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి కనిపించే ఆయన, ఈసారి సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యక్షమై అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. 

ఈ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడున్న వారు చప్పట్లతో స్వాగతం పలికారు. జగదీష్ కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. విజయ్ గత దశాబ్ద కాలంగా తన మేనేజర్ జగదీష్‌తో దగ్గరగా పనిచేస్తున్నారు. ఆయన సినిమా డేట్లు, ప్రొడక్షన్ సంబంధిత విషయాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

విజయ్ నటించిన ‘మాస్టర్’, ‘లియో’ చిత్రాలకు కూడా జగదీష్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సమయంలో కూడా జగదీష్ ఆయనతోనే ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. గృహప్రవేశ వేడుకకు ముందు కూడా విజయ్ సచివాలయంలో సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh government to conduct mudragada padmanabham last rites with state honours

Mudragada Padmanabham | ముద్రగడ సేవలకు గౌరవ వందనం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham)కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ప్రజా జీవితంలో అందించిన సేవలకు...
- Advertisement -
Chat on WhatsApp