Sunday, July 5, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTJr NTR Birthday | యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పవర్ స్టార్ విషెస్... వైరల్ అవుతున్న...

Jr NTR Birthday | యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పవర్ స్టార్ విషెస్… వైరల్ అవుతున్న సెలబ్రిటీల పోస్టులు

-

Chat on WhatsApp

Jr NTR Birthday: నటనకు మరో రూపం JR. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా  శుభాకాంక్షల వెల్లువ నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెబుతుండటంతో ఎన్టీఆర్ పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో మరింత హైప్ ఏర్పడింది.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. “ప్రముఖ కథానాయకులు ఎన్టీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌పై ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని, శ్రీను వైట్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తారక్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.

ఇదిలా ఉండగా, సీనియర్ నటి ఖుష్బూ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.“తనకు ఎంతో అభిమానమైన హీరో ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘లవ్ యూ కన్నా.. నా తారక్, నా డ్రాగన్’ అంటూ ఖుష్బూ చేసిన పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది.”

అలాగే నటుడు నారా రోహిత్ కూడా “నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలి. డ్రాగన్ గ్లింప్స్ అదిరిపోయింది” అంటూ ట్వీట్ చేశారు. మొత్తంగా సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్‌తో మార్మోగుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp