టాలీవుడ్ నటుడు మంచు మనోజ్(Manchu Manoj) పుట్టినరోజు సందర్భంగా NBK111 మూవీ టీమ్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మాలినేని సోషల్ మీడియా ద్వారా మనోజ్‌కు ప్రత్యేకంగా పోస్టర్ సర్ప్రైజ్ బర్త్‌డే విషెస్ తెలిపారు. “మనోజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సెట్స్‌లో అతని ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అద్భుతంగా ఉంటాయి. NBK111లో అతనితో కలిసి పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అంటూ గోపీచంద్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో మనోజ్ స్టైలిష్ సూట్లో, కొత్త హెయిర్ స్టైల్‌తో పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. పోస్టర్లో కనిపించిన బులెట్ ఇమేజ్ సినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను సూచిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఫిలింనగర్ సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
స్టార్ హీరోయిన్ నయనతారతో కలిసి ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ముఖ్యంగా బాలకృష్ణ – మంచు మనోజ్ మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట.
ఇప్పటికే బాలకృష్ణ – గోపీచంద్ మాలినేని కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ భారీ విజయాన్ని అందుకోవడంతో #NBK111పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.








