AP LAWCET 2026 మరియు AP PGLCET 2026 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ సోమవారం అధికారికంగా విడుదల చేశారు. మే 4న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ న్యాయ ప్రవేశ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 19,197 మంది అర్హత సాధించగా, సుమారు 80 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈసారి లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(Sri Padmavati Mahila Visvavidyalayam) విజయవంతంగా నిర్వహించింది. పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. న్యాయ విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.
ఫలితాలను తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ నమోదు సంఖ్య, హాల్ టికెట్ నంబర్, జనన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
CLICK HERE: https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_GetResult.aspx
పరీక్ష ఫలితాల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
ALSO READ:Peddi | ‘పెద్ది’ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ…రామ్ చరణ్’కి ఇంటర్నేషనల్ క్రేజ్








