Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshTTD Srivani tickets | శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో అక్రమాలకు చెక్.. టీటీడీ కొత్త ప్లాన్

TTD Srivani tickets | శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో అక్రమాలకు చెక్.. టీటీడీ కొత్త ప్లాన్

-

Chat on WhatsApp

TTD Srivani tickets: టీటీడీ శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో టికెట్ల దుర్వినియోగాన్ని ఆపేందుకు ఇకపై లక్కీడిప్( Lucky Dip) విధానాన్ని అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రోజుకు 1,500 మంది భక్తులకు శ్రీవాణి కోటా టికెట్లు జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

భక్తులకు మరింత పారదర్శకంగా టికెట్లు అందించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్‌లో అనేక అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం పెరుగుతున్న నేపథ్యంలో లక్కీడిప్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన విమానాశ్రయాల నుంచి కూడా శ్రీవాణి కోటా టికెట్లు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మరోవైపు గతంలో విరాళాలు ఇచ్చి దర్శనం పొందలేకపోయిన సుమారు 41 వేల మంది భక్తులకు జూన్ మొదటి వారం నుంచి రోజుకు 300 టికెట్ల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ బ్యాక్‌లాగ్‌ను వచ్చే 5 నుంచి 10 నెలల్లో పూర్తిగా క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

భక్తులు శ్రీవాణి టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ విధానం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భక్తులకు పారదర్శకంగా, సులభంగా దర్శనం టికెట్లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp