Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsChatGPT గైడెన్స్ తో యువకుడు మృ**తి...OpenAI పై తల్లిదండ్రుల కేసు

ChatGPT గైడెన్స్ తో యువకుడు మృ**తి…OpenAI పై తల్లిదండ్రుల కేసు

-

Chat on WhatsApp

అమెరికాలో ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐ(OpenAI)పై సంచలన కేసు నమోదైంది. 19 ఏళ్ల సామ్ నెల్సన్ మరణానికి చాట్‌జీపీటీ(ChatGPT) ఇచ్చిన సూచనలు కారణమని ఆయన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం కోరినప్పుడు చాట్‌జీపీటీ “అక్రమ డ్రగ్ కోచ్”లా వ్యవహరించిందని వారు కేసులో పేర్కొన్నారు.

కోర్టు పత్రాల ప్రకారం, సామ్ నెల్సన్ క్రాటమ్ మరియు తక్కువ మోతాదులో జానాక్స్ కలిపి తీసుకుంటే మత్తు ప్రభావం పెరుగుతుందని, వాంతులు తగ్గుతాయని సూచనలు చాట్‌జీపీటీ నుండి పొందినట్లు ఆరోపణ ఉంది. అయితే ఈ మిశ్రమం ప్రాణాపాయం కలిగించవచ్చని ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదని కుటుంబం ఆరోపిస్తోంది.

ఈ ఘటనపై ఓపెన్‌ఏఐ స్పందిస్తూ, చాట్‌జీపీటీ వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. అలాగే కేసులో ప్రస్తావించిన పాత మోడల్ ప్రస్తుతం ఉపయోగంలో లేదని తెలిపింది.

అయితే యువకుడికి మత్తు పదార్థాల వినియోగ సమస్య ఉన్నప్పటికీ, చాట్‌జీపీటీ “డ్రగ్ అనుభవాన్ని మెరుగుపరుచుకోవడం”పై సూచనలు ఇచ్చిందని ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీంతో బాధిత కుటుంబం నష్టపరిహారంతో పాటు చాట్‌జీపీటీలో అక్రమ డ్రగ్స్ సంబంధిత చర్చలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది.

అంతేకాదు, GPT-4o వంటి పాత మోడల్‌ను తొలగించాలని, స్వతంత్ర ఆడిట్ పూర్తయ్యే వరకు ChatGPT Health సేవలను నిలిపివేయాలని కోర్టును కోరింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp