Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeSportsIPL 2026 playoffs race | ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు హీట్.. ఏ జట్టుకు ఎంత...

IPL 2026 playoffs race | ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు హీట్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్?

-

Chat on WhatsApp

IPL 2026 playoffs race: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండటంతో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రతి మ్యాచ్ పాయింట్ల పట్టికను మార్చేస్తోంది. ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అగ్రస్థానానికి చేరగా, ముంబై మరియు లక్నో జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటపడ్డాయి. ఇంకా 8 జట్లు టాప్-4 కోసం పోటీలో ఉన్నాయి.

ఆర్సీబీకి మంచి ఛాన్స్

ప్రస్తుతం ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో టాప్‌లో ఉంది. +1.103 నెట్ రన్‌రేట్ కూడా వారికి భారీ అడ్వాంటేజ్‌గా మారింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా ప్లేఆఫ్స్ దాదాపు ఖాయం. రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఎక్కువ.

హైదరాబాద్, గుజరాత్‌కు కీలక మ్యాచ్‌లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో బలమైన స్థితిలో ఉంది. ఇంకా మూడు మ్యాచ్‌లు ఉండగా రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. మే 22న ఆర్సీబీతో మ్యాచ్ కీలకం. గుజరాత్ టైటాన్స్‌కు కూడా ఇదే పరిస్థితి. అయితే తక్కువ నెట్ రన్‌రేట్ కారణంగా మరిన్ని విజయాలు అవసరం.

పంజాబ్ కింగ్స్ హాట్ ఫేవరెట్

పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉంది. 10 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లు సాధించిన ఆ జట్టుకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో రెండు గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం.

చెన్నై, రాజస్థాన్‌పై ఒత్తిడి

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండూ 12 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ బలంగా లేదు. సీఎస్‌కేకు కనీసం రెండు విజయాలు తప్పనిసరి. రాజస్థాన్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. ఈ రెండు జట్లు నాలుగో స్థానం కోసం గట్టిగా పోటీ పడే అవకాశముంది.

కేకేఆర్, ఢిల్లీకి కష్టమే

కోల్‌కతా నైట్ రైడర్స్ మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి. ఒక్క ఓటమి వచ్చినా అవకాశాలు దాదాపు ముగిసే ప్రమాదం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఇంకా క్లిష్టం. భారీ నెట్ రన్‌రేట్ లోటు కారణంగా అన్ని మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

ముంబై, లక్నో అవుట్

వరుస ఓటములతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో మిగిలిన జట్ల మధ్య టాప్-4 పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp