Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeCrime Newsజోధ్‌పూర్‌లో చిన్నారిపై దారుణ అత్యాచారం

జోధ్‌పూర్‌లో చిన్నారిపై దారుణ అత్యాచారం

-

Chat on WhatsApp

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, నిందితులు ఎలాంటి భీతి లేకుండా నిర్భయంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మరో ఘటన రుజువు చేసింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి కోసం గాలిస్తున్నారు. ఆలయం బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో పొదల్లో ఉన్న బాలికను అటుగా వెళ్లిన ఓ మహిళ గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చిన్నారి పెదవులపై గాట్లు ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అత్యాచారానికి గురైనట్టు పరీక్షల్లో తేలింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడు బాలికను ఎత్తుకెళ్తుండడం సీసీటీవీలో రికార్డయిందని పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు చెందినవారని, వలస వచ్చి జోధ్‌పూర్‌లోని ఓ మురికివాడలో ఉంటున్నట్టు  తెలిపారు. తండ్రి చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, బాలిక తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వివరించారు. వారికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UN Security Council | భారతీయుల రక్షణే లక్ష్యం.. ఐరాసలో భారత్ సంచలన వ్యాఖ్యలు

UN Security Council: పశ్చిమాసియాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి పరిధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న...
- Advertisement -
Chat on WhatsApp