Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeNationalPM Modi | హుగ్లీ నదిలో మోడీ బోట్ రైడ్... ఫోటోలు వైరల్

PM Modi | హుగ్లీ నదిలో మోడీ బోట్ రైడ్… ఫోటోలు వైరల్

-

Chat on WhatsApp

PM Modi: నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్ల్లీ రివర్(Hooghly River) తీరంలో ప్రత్యేక క్షణాలు గడిపారు. శుక్రవారం ఉదయం ఆయన హుగ్లీ నదిలో బోట్ రైడ్ చేస్తూ, స్వయంగా కెమెరాతో నది అందాలను చిత్రీకరించారు. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, హుగ్లీ నది బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలతో విడదీయరాని సంబంధం కలిగి ఉందని తెలిపారు. గంగానది జలాలు ప్రాచీన నాగరికతకు ప్రతీకగా నిలుస్తాయని, బెంగాలీల జీవితాల్లో దానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.

నది తీరంలో కొంత సమయం గడిపిన ఆయన, పడవ నడిపేవారితో పాటు ఉదయపు నడకకు వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. ముఖ్యంగా పడవ కార్మికుల శ్రమను అభినందిస్తూ, వారి కృషి గొప్పదని కొనియాడారు.

ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మోడీ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో విద్యాసాగర్ సేతు (Vidyasagar Setu) మరియు హౌరాహ్ బ్రిడ్జి (Howrah Bridge) వంటి చారిత్రక నిర్మాణాలను సమీపంగా వీక్షించడం ఆనందంగా అనిపించిందని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Shubman Gill injured during practice session before India's Sri Lanka Test series.

Sri Lanka Test 2026 | శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.....

Sri Lanka Test 2026: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల...
- Advertisement -
Chat on WhatsApp