Tuesday, April 14, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTVaranasi Video Leaks | జక్కన్నను కలవరపెడుతున్న వారణాసి వీడియో లీక్

Varanasi Video Leaks | జక్కన్నను కలవరపెడుతున్న వారణాసి వీడియో లీక్

-

Chat on WhatsApp

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం Varanasi(వారణాసి) ప్రస్తుతం లీకుల సమస్యతో(Varanasi Video Leaks) వార్తల్లో నిలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తరచూ లీకులు బయటకు వస్తుండటం చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

గతంలోనే మహేష్ బాబు మరియు ప్రిథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) మధ్య సాగే సన్నివేశానికి సంబంధించిన క్లిప్ బయటకు వచ్చి వైరల్ అయింది. ఇప్పుడు భారీ యాక్షన్ విజువల్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో చిత్రబృందం షాక్‌కు గురైంది.

రాజమౌళి ఎంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, సెట్స్‌లో ఎవరో ఒకరు రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తూ లీక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లీకులు సినిమా హైప్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో Baahubali, RRR చిత్రాల సమయంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ, సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీ పడటం లేదు.

గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయించారు.

ALSO READ:Telangana Heatwave | తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు – ప్రజలకు హెచ్చరిక 


- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Kavya Maran smiling and accepting a rose from a fan after SRH victory at Uppal Stadium

Kavya Maran | అభిమానితో క్యూట్ మూమెంట్.. గులాబీ పువ్వును తీసుకున్న కావ్యా మారన్

Kavya Maran: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ విజయంతో...
- Advertisement -
Chat on WhatsApp