Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshGudivada Amarnath | ఏపీలో కలకలం...మాజీ మంత్రి అమర్నాథ్‌కు జైలు శిక్ష

Gudivada Amarnath | ఏపీలో కలకలం…మాజీ మంత్రి అమర్నాథ్‌కు జైలు శిక్ష

-

Chat on WhatsApp

Gudivada Amarnath: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం వెలువరించారు.

2016 ఏప్రిల్‌లో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ అమర్నాథ్ ఆందోళన నిర్వహించారు. అప్పట్లో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో విచారణ పూర్తయిన అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.

ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, తాను అప్పట్లో చేసిన రైల్వే జోన్ పోరాటం వల్లే ఇప్పుడు విశాఖకు జోన్ మంజూరైందని పేర్కొన్నారు. అలాగే దిగువ న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాలు చేస్తానని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp