FIFA World Cup 2026: ఫుట్‌బాల్ అభిమానులకు షాక్ ఇస్తూ ఫిఫా ప్రపంచకప్ 2026 టికెట్ల ధరలను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఉన్న టికెట్ కేటగిరీలతో పాటు “ఫ్రంట్ కేటగిరీ” పేరుతో కొత్త ప్రీమియం విభాగాన్ని ప్రవేశపెట్టింది. దీంతో స్టేడియంలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ ప్రేక్షకులకు మరింత భారంగా మారింది.
జూన్ 12న అమెరికాలో జరిగే యూఎస్ ప్రారంభ మ్యాచ్ టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఫ్రంట్ కేటగిరీ-1 టికెట్ ధర $4,105 (సుమారు రూ.3.4 లక్షలు)గా నిర్ణయించగా, గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర $2,735 మాత్రమే ఉండేది. ఇక ఫ్రంట్ కేటగిరీ-2 టికెట్లు $1,940 నుంచి $2,330 (రూ.1.6 లక్షలు–రూ.1.9 లక్షలు) మధ్య ఉన్నాయి.
ఈ ప్రపంచకప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లోని 16 నగరాల్లో జరుగనుంది. కెనడాలో జరిగే ప్రారంభ మ్యాచ్ టికెట్ ధరలు కూడా $3,360 (సుమారు రూ.2.8 లక్షలు) వరకు పెరిగాయి. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లకు కూడా టికెట్ ధరలు $905 (రూ.75 వేల వరకు)గా ఉన్నాయి.
ఇక న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గరిష్ట ధర $10,990 (రూ.9 లక్షలకు పైగా)గా నిర్ణయించగా, గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. కేటగిరీ-2 టికెట్లు $5,575–$7,380, కేటగిరీ-3 టికెట్లు $4,185–$5,785 మధ్య ఉన్నాయి.
మొత్తంగా, ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా టికెట్ ధరలను భారీగా పెంచడంతో సాధారణ అభిమానులకు స్టేడియంలో మ్యాచ్‌లు చూడడం కష్టంగా మారింది.
FIFA World Cup 2026 | అభిమానులకు షాక్…ఫిఫా కొత్త ప్రీమియం టికెట్లు…సామాన్యులకు దూరమవుతున్న వరల్డ్ కప్
-








