Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsOla Electric | మార్కెట్ నష్టాల్లోనూ ఓలా జోరు.. షేరు పెరుగుదల వెనుక అసలు కథ...

Ola Electric | మార్కెట్ నష్టాల్లోనూ ఓలా జోరు.. షేరు పెరుగుదల వెనుక అసలు కథ ఇదే

-

Chat on WhatsApp

Ola Electric: భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్న రోజే ఓలా ఎలక్ట్రిక్ షేరు మాత్రం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. గురువారం ట్రేడింగ్‌లో ఈ షేరు 9 శాతానికి పైగా ఎగబాకి, రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 15 శాతం లాభాన్ని నమోదు చేసింది.

కంపెనీ సొంతంగా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) 46100 బ్యాటరీ సెల్స్ సిద్ధం చేశామని ప్రకటించడమే ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా మారింది.

ఇప్పటివరకు విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతున్న బ్యాటరీ సెల్స్‌ను స్వయంగా తయారు చేయగలగడం ఓలా భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది.

ఈ కొత్త సెల్స్ వల్ల తయారీ వ్యయం తగ్గడంతో పాటు, స్కూటర్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే త్రైమాసికం నుంచే ఈ టెక్నాలజీని వాహనాల్లో వినియోగించనున్నట్టు కంపెనీ సంకేతాలు ఇచ్చింది.

ఇదే సమయంలో రోడ్‌స్టర్ x+ మోడల్‌పై భారీ ధరల కోత, మార్చిలో రిజిస్ట్రేషన్ల పెరుగుదల, సర్వీస్ నాణ్యత మెరుగుపడుతున్న సంకేతాలు కూడా షేరు బలపడటానికి తోడయ్యాయి. అయితే, ప్రస్తుత ర్యాలీ ఉన్నప్పటికీ, ఓలా షేరు ఇంకా తన గత గరిష్ట స్థాయి కంటే చాలా దిగువననే ఉంది.

అయినప్పటికీ, స్వయం సమృద్ధి దిశగా కంపెనీ వేస్తున్న అడుగులు భవిష్యత్తులో దీన్ని మరింత బలపరచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp