Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRanbir Kapoor | ‘రామాయణ్’లో రణ్‌బీర్ డబుల్ ట్రీట్.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్

Ranbir Kapoor | ‘రామాయణ్’లో రణ్‌బీర్ డబుల్ ట్రీట్.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్

-

Chat on WhatsApp

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ లో ఆయన కేవలం శ్రీరాముడి పాత్రలోనే కాదు, పరశురాముడి పాత్రలో కూడా కనిపించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవల విడుదలైన ‘రామ’ గ్లింప్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన వేళ, ఈ డబుల్ రోల్ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. రణ్‌బీర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు పలు బాలీవుడ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రణ్‌బీర్ మాట్లాడుతూ, “శ్రీరాముడు, పరశురాముడు వంటి రెండు దివ్యమైన పాత్రలు పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పారు.

ఈ రెండు పాత్రల బాడీ లాంగ్వేజ్, స్వభావం, ఆధ్యాత్మిక భావం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయని, అందుకే షూటింగ్‌కు ముందు దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రత్యేకంగా సిద్ధమయ్యానని తెలిపారు. ఒకే సినిమాలో విష్ణుమూర్తి రెండు అవతారాలను ఒకే నటుడు పోషించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యాష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. నిర్మాత నమిట్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ విజువల్ ఎపిక్ రెండు భాగాలుగా రానుండగా, మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. దీంతో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp