Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTNagarjuna 100th Movie | 25 ఏళ్ల కుర్రాడిగా నాగార్జున.. ‘కింగ్ 100’లో డీ-ఏజింగ్ మ్యాజిక్!

Nagarjuna 100th Movie | 25 ఏళ్ల కుర్రాడిగా నాగార్జున.. ‘కింగ్ 100’లో డీ-ఏజింగ్ మ్యాజిక్!

-

Chat on WhatsApp

Nagarjuna 100th Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున పాత్ర, టెక్నాలజీ వినియోగం, కథా నేపథ్యం—అంత కలిసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్రంలో లేటెస్ట్ డీ-ఏజింగ్ టెక్నాలజీని వినియోగించడం విశేషం. దీని ద్వారా నాగార్జునను 25 ఏళ్ల యువకుడి లుక్‌లోనూ, 60 ఏళ్ల వ్యక్తిగా కూడా వెండితెరపై చూపించబోతున్నారు.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ నటి టబు, అలాగే సుస్మితా భట్, విజయేంద్ర వంటి కీలక నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇంకా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ ప్రాజెక్ట్‌ను ఒక విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నట్టు నాగార్జున చెప్పడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.


ఇక కథ విషయానికి వస్తే, ఇది కేవలం స్టైలిష్ సినిమా మాత్రమే కాదు.. ఒక బలమైన ఎమోషనల్ జర్నీ కూడా. నాగార్జున తాజాగా ఈ సినిమా కథపై ఇచ్చిన హింట్ ప్రకారం, “ఏమీ లేని స్థితి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే వ్యక్తి జీవన ప్రయాణం” ఈ చిత్రానికి ప్రధాన కథాంశం.

అంతేకాదు, ఈ కథ మొత్తం తండ్రి-కూతుళ్ల భావోద్వేగ బంధం చుట్టూ తిరుగుతుందని ఆయన వెల్లడించారు.

అందుకే ఈ సినిమా ఒకవైపు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, మరోవైపు ఇన్‌స్పిరేషనల్ ఫ్యామిలీ డ్రామాగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, ఇప్పటికే దాదాపు 45 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు సమాచారం. దీంతో నాగార్జున 100వ సినిమా టాలీవుడ్‌లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

jagga reddy says he is ready to contest elections if congress party directs

Jagga Reddy | సంగారెడ్డి కాదు.. మరోచోట నుంచి పోటీ చేస్తా: జగ్గారెడ్డి సంచలన...

గతంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తాజాగా తన వైఖరిలో మార్పు వచ్చినట్లు స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు...
- Advertisement -
Chat on WhatsApp