HomeSportsIPL 2026 | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్...అసలు ఏమైంది అంటే ?

IPL 2026 | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్…అసలు ఏమైంది అంటే ?

-

Chat on WhatsApp

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో, అతని స్థానంలో యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది.

కమిన్స్ పూర్తిగా కోలుకుని జట్టులోకి చేరే వరకు ఇషాన్ కిషన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.

ఇక జట్టు వైస్ కెప్టెన్‌గా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను నియమించడం ద్వారా మేనేజ్‌మెంట్ యువ ఆటగాళ్లపై విశ్వాసం ఉంచినట్లు స్పష్టం చేసింది. ఈ ఇద్దరు ప్లేయర్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం పాట్ కమిన్స్ తన స్వదేశంలో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే అతను జట్టులోకి తిరిగి చేరుతాడని SRH యాజమాన్యం వెల్లడించింది.

ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. యువ ఆటగాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా SRH కొత్త వ్యూహంతో ఈ సీజన్‌లో బరిలోకి దిగుతోంది.

దూకుడైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఇషాన్ కిషన్, కెప్టెన్‌గా కూడా అదే ఆగ్రెసివ్ ధోరణిని చూపుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అతని నాయకత్వం జట్టుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp