Sunday, March 8, 2026
No menu items!
Google search engine
HomeENTERTAINMENTBrahmanandam | చెంపతట్టి గోల్డ్ రింగ్ ఇచ్చిన బ్రహ్మానందం...ఎందుకో తెలుసా ?

Brahmanandam | చెంపతట్టి గోల్డ్ రింగ్ ఇచ్చిన బ్రహ్మానందం…ఎందుకో తెలుసా ?

- Advertisement -
Google search engine

Brahmanandam: తెలుగు సినీ రంగంలో తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరించే ప్రముఖ నటుడు బ్రహ్మానందం మరోసారి తన సరదా ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని(Sampradayini Suppini Suddapousani) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం తన ప్రత్యేకమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేశారు.

ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నశివాజీ తన కుటుంబంతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం మధ్యలో స్టేజీపైనే ఉన్న శివాజీ చిన్న కుమారుడు రిక్కీని చూసిన బ్రహ్మానందం సరదాగా “నీ కొడుక్కి అడ్వాన్స్ ఇవ్వాలి” అని అన్నారు.

దానికి శివాజీ కూడా నవ్వుతూ సమ్మతించడంతో రిక్కీని దగ్గరకు పిలిచారు. రిక్కీ స్టేజీకి రాగానే బ్రహ్మానందం అతని చెంపపై సరదాగా తట్టి “మొదటి సినిమాకు అడ్వాన్స్ ఇస్తున్నాం” అంటూ అందరినీ నవ్వించారు.

అప్పటికే అక్కడ ఉన్నవారు హాస్యనటుడు అలీ ముందే అడ్వాన్స్ ఇచ్చాడని చెప్పగా, “డాలర్ నోట్ ఇక్కడ పనికిరాదు, ఇక్కడ రూపాయలే కావాలి” అంటూ బ్రహ్మానందం మరోసారి హాస్య వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో అలీ తన పర్సులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా, బ్రహ్మానందం తన చేతిలో ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి రిక్కీకి బహుమతిగా ఇచ్చారు. ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది.

ఇక ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రంలో శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మొదట ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయాలని భావించినా, తర్వాత నిర్ణయం మార్చుకొని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

ఈ సినిమా మార్చి 6, 2026న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం, అలీ, బండ్లగణేష్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular