Saturday, April 18, 2026
Chat on WhatsApp
HomeUncategorizedLIC| ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త టెక్ స్కీమ్ – మార్చి 6 వరకు ఛాన్స్

LIC| ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త టెక్ స్కీమ్ – మార్చి 6 వరకు ఛాన్స్

-

Chat on WhatsApp

LIC MF Technology Fund NFO: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. దీర్ఘకాలికంగా మెరుగైన రాబడుల కోసం పెట్టుబడిదారులు ఈక్విటీ ఆధారిత స్కీమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో LIC Mutual Fund కొత్తగా ‘LIC MF Technology Fund’ పేరుతో టెక్నాలజీ థీమ్ ఆధారిత NFOను ప్రారంభించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమై మార్చి 6 వరకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మార్చి 19 నుంచి సాధారణ కొనుగోలు, విక్రయాలకు తెరవబడుతుంది.

ఈ ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ టెక్నాలజీ మరియు అనుబంధ రంగాల్లో కనీసం 80% వరకు పెట్టుబడులు పెడుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ప్రముఖ ఐటీ కంపెనీలతో పాటు డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, అభివృద్ధి చెందుతున్న టెక్ సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టనుంది. మిగిలిన భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాలు, అలాగే REITs, INVITs‌లలో పెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం AI ప్రభావం, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, దీర్ఘకాల వృద్ధి అవకాశాలపై కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ ఫండ్ పనితీరుకు BSE Tech Total Return Index (TRI)ను బెంచ్‌మార్క్‌గా ఎంచుకున్నారు.

NFO దశలో కనీస పెట్టుబడి రూ.1000 కాగా, గరిష్ట పరిమితి లేదు. తర్వాత రోజువారీగా రూ.100 నుంచి, SIP రూపంలో రూ.200 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. టెక్నాలజీ రంగంలో దీర్ఘకాల లాభాలు ఆశించే పెట్టుబడిదారులకు ఇది సరైన ఎంపికగా భావిస్తున్నారు.

also read:Vivo v60 lite 4g | 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వివో కొత్త ఫోన్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102